Saturday, December 21, 2024

విద్యుదాఘాతంతో ఆర్‌ఎంపి మృతి

- Advertisement -
- Advertisement -

టేకులపల్లి : మంచినీటి బోరుకు విద్యుత్ వైరు సరిచేస్తూ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఆర్‌యంపి మృతి చెందిన సంఘటన గురువారం టేకులపల్లి మండలం బోడు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం మండల పరిధిలోని బోడుగ్రామంలో ఆర్‌ఎంపి వైద్యునిగా సేవలందిస్తున్న మిట్టపల్లి బలరాముడు (50) మధ్యాహ్నం మంచినీటి బోరుకు వెళ్ళే విద్యుత్ వైరును సరిచేసే క్రమంలో విద్యుత్‌షాక్‌కు గురై స్పృహ కోల్పోయాడు.

అదే సమయంలో భార్య ఇంటి వెనుక భాగంలో పనిలో నిమగ్నమై ఉంది. ఇదిలా ఉండగా స్పృహకోల్పోయి ఉన్న భర్తను చూసి గ్రామస్తుల సాయంతో సులానగర్ పిహెచ్‌సికి తరలించారు. అతనిని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News