Monday, January 20, 2025

తాండూరులో ఆర్‌ఎంపి డాక్టర్ కీచక లీలలు

- Advertisement -
- Advertisement -

తాండూరు : తాండూరులో ఆర్‌ఎంపి డాక్టర్ కీచక లీలలు బట్టబయలు అయ్యాయి. ఓ మహిళతో నగ్నంగా సెక్స్ విడియోలు వైరల్ కావడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. డాక్టర్ వృత్తిలో ఉండి ఇలాంటి కీచక పనులు చేయడంపై మండిపడుతున్నారు. తాండూరు మండలం చెంగోల్ గ్రామానికి చెందిన ఆర్‌ఎంపి డాక్టర్ తాండూరు పట్టణంలోని పాతకూరగాయ మార్కెట్‌లో ఆసుపత్రిని నడిపిస్తున్నారు. తన దగ్గర పనిచేసే ఓ నర్సుతో నగ్నంగా వీడియోలు చిత్రీకరిస్తూ సెక్స్ వాటప్స్ గ్రూపుల్లో వైరల్ అవుతున్నా యి. వారం రోజుల క్రితం ఈ సంఘటన జరిగినప్పటికి రెండు మూ డు రోజులుగా తాండూరులో హాట్ టాఫిక్‌గా మారింది. వచ్చి రాని వైద్యం ముసుగులో ఈ ప్రభుద్దుడు ఇలాంటి రాసలీలలు గతంలో కూడా చేసినట్లు ప్రచారం సాగుతోంది. గతంలో సదరు ఆర్‌ఎంపి డాక్టర్ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో తన భార్య చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం సాగుతుంది.

సెక్స్ విడియోలు వాటప్స్‌లో బయటపడటంతో ఆర్‌ఎంపి డా క్టర్ సెక్స్‌లో పాలుపంచుకున్న మహిళతో ఎలాంటి కేసులు పెట్టకూడదని ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయంలో అదే గ్రామానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి కల్పించుకుని పోలీస్ స్టేషన్‌లో కేసులు చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు ప్రచారం సాగుతుంది. సంబంధిత మహిళతో చర్చించి డాక్టర్‌పై ఎలాంటి కేసులు చేయకుండా డబ్బు ఆశ చూపించి జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇద్దరు ఇష్టప్రకారమే సెక్స్‌లో పాల్గొని ఉన్నప్పటికి అలాంటి వీడియో చిత్రాలను వాటప్స్ గ్రూపుల్లో పెట్టడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటివి పోలీసులు సుమోటగా తీసుకుని కేసు నమోదు చేయకపోతే సమాజం తలవంచుకునే పరిస్థితి ఏర్పడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాండూరు డివిజన్ పోలీసులు కీచక డాక్టర్‌పై సుమోటగా కేసు నమోదు చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే మరి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News