Friday, November 22, 2024

తమిళనాడు గవర్నర్‌గా ఆర్‌ఎన్ రవి ప్రమాణం

- Advertisement -
- Advertisement -

RN Ravi sworn in as Governor of Tamil Nadu

చెన్నై: తమిళనాడు నూతన గవర్నర్‌గా రవీంద్ర నారాయణ్ రవి శనివారం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. భన్వరీలాల్ పురోహిత్ స్థానంలో రవి గవర్నర్‌గా నియమితులయ్యారు. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ బెనర్జీ రాజ్‌భవన్‌లో కొత్త గవర్నర్ రవి చేత ప్రమాణం చేయించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, ఆయన మంత్రివర్గ సహచరులు, ప్రతిపక్ష నాయకుడు కె పళనిస్వామి, ఇతరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నాగాల్యాండ్‌లో నాగా శాంతి చర్చలకు కేంద్రం తరఫున దూతగా గతంలో పనిచేసిన సీనియర్ ఐపిఎస్ అధికారి రవిని తమిళనాడు గవర్నర్‌గా గత వారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నియమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News