Wednesday, January 22, 2025

రక్తమోడిన రహదారులు

- Advertisement -
- Advertisement -

అతివేగానికి ఏడుగురి బలి

శామీర్‌పేటలో ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొన్న కారు
ముగ్గురు మృతి

నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదాన్ని చూస్తున్న వారిపైకి దూసుకొచ్చిన డిసిఎం

నలుగురు దుర్మరణం

మన తెలంగాణ/ శామీర్ పేట : దైవ దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో మృత్యువు రూ పంలో కబళించిన హృదయ విధారకమైన సం ఘటన ఔ టర్ రింగ్ రోడ్డుపై శనివారం తెల్లవారుజామున శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శామీర్ పేట ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాలప్రకారం … మేడ్చల్ జిల్లా, చింతల్, కుత్బుల్లాపూర్కు చెందిన బై రి మారుతి (31), బాల్ రాజ్ గౌడ్(43),శ్రీనివాస్, సూరజ్, సురేష్, శ్రీపతి వరుణ్ లు కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఇనోవా కార్ లో వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు. రాజమండ్రి నుంచి తూంకుంట గ్రామానికి వీరవెంకట సత్యనారాయణ ఆలియాన్ ప్రసాద్, మురళి, మహేష్ లు స్నేహితులు వీరు రెండు వ్యాన్లలో కొబ్బరికాయలు అరటి గెలలు నింపుకొని వస్తుండగా శామీర్ పేట సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రసాద్ వాహనం టైర్ పంక్చర్ కావడంతో వాహానాలని రో డ్డు పక్కన నిలిపి టైర్ మార్చారు.అదే సమయం లో బైరి మారుతి మిత్రులు ప్రయాణిస్తున్న ఇనోవా వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టింది.

దీంతో ఇనోవా వాహనంలో ఉన్నఆరుగురిలో బైరి మారుతి (31), బాలరాజ్ గౌడ్ (43) అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. అశోక్ లీ లాండ్ డ్రై వర్ ప్రసాద్ తలకు శరీరబాగాలకు తీవ్ర గా యాలు కావడంతో అల్వాల్ లోని ఓజోన్ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రసాద్ (24) మృతి మృత్యువాత పడ్డాడు.మిగిలిన నలుగురు క్షతగాత్రులు శ్రీనివాస్, సూరజ్, సురేష్ కు బలమైన గా యాలయ్యాయి. శ్రీపతి వరుణ్ కు స్వల్ప గా యాలు కాగావీరందరిని అంబులెన్స్ సహయ ంతో ఆసుపత్రికి తరలించారు. మృతుడి ప్ర సాద్ కు 11 నెలల బాబు ఉన్నాడని వచ్చేనెలలో పుట్టినరోజు వేడుకలు చేస్తామని చెప్పాడని మృతుడి తల్లిదండ్రులు రోదించిన తీరు పలువురిని కం టతడి పెట్టించింది. మృతదేహాలనుపోస్టుమా ర్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సిబ నిరంజన్ రెడ్డి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News