Monday, January 27, 2025

బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎపిలోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 16వ నెంబర్ జాతీయ రహాదారిపై ఓ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీపైకి దూసుకెళ్ళింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు అద్దంకి ఎస్‌ఐ సమందర్ వళి కుటుంబ సభ్యులుగా పోలీసులు గుర్తించారు.

మృతుల్లో ఎస్‌ఐ సమందర్ వళి భార్య వహీదా(36), కుమార్తె అయేషా (9), ఎస్‌ఐ కుటుంబ సన్నిహితులు గుర్రాల జయశ్రీ (50), గుర్రాల దివ్వతేజ (29), డ్రైవర్ బ్రహ్మచారి (22) ఉన్నారు. ఆదివారం ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా కొరిశపాడు మండలం మేదరమెట్ల వద్ద ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News