Thursday, January 23, 2025

ఇస్నాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

 

పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. గోవా నుంచి కారులో వస్తుండగా ఇస్నాపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News