Wednesday, January 22, 2025

టిప్పర్ బీభత్సం: 90 గొర్రెలు మృతి

- Advertisement -
- Advertisement -

సాగర్ : నల్గొండ జిల్లాలోని సాగర్ దయ్యాలగంటి వద్ద శనివారం టిప్పర్ బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చి ఆగి ఉన్న కారు, అంబులెన్స్ ను ఢీకొట్టింది. అనంతరం గొర్రెల మందపైకి దూసుకెళ్లి, ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొని టిప్పర్ ఆగింది. దీంతో ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులకు తృటిలో ప్రమాదం తప్పింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో 90 గొర్రెలు మృతి చెందాయి. తమకు న్యాయం చేయాలని గొర్రెల కాపారులు ఆందోళన చేస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అధికవేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News