Monday, December 23, 2024

నార్కెట్‌పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

నార్కెట్‌పల్లి : హైద్రాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 28 మంది తీవ్రగాయాల పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం ఏపి లింగోటం సమీపంలో ఆగి ఉన్న నీటి ట్యాంకర్‌ను కోదాడ నుంచి హైద్రాబాద్ వెళుతున్న ఆర్టీసి బస్సు అతివేగంగా ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న 28 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయని నార్కెట్‌పల్లి ఎస్‌ఐ సైదాబాబు తెలిపారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ప్రయాణికులను స్థానిక ఎంపిపి సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి సహకారంతో నార్కెట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు.

నకిరేకల్‌లో జరిగే కార్యక్రమానికి వెళుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ,ఎంపిపి నరేందర్ రెడ్డి చలించి హుటాహుటిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో జాతీయ రహదారి పై ఎలాంటి వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కోదాడ నుంచి హైద్రాబాద్ బయలు దేరిన బస్సులో 43 మంది ప్రయాణిస్తుండగా 28 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సంఘటన తెలుసుకున్న వెంటనే నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ దైద రవీందర్ సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం కామినేని ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్నవారిని పరామర్శించి ఓదార్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News