Tuesday, January 21, 2025

రెండు బైకులు ఢీ: ఒకరు స్పాట్ డెడ్

- Advertisement -
- Advertisement -

ఇందల్‌వాయి : నిజామాబాద్ జిల్లా ఇందల్ వాయి మండలంలో శుక్రవారం రోడ్డుప్రమాదం జరిగింది. మృతుడిని ఫారెస్ట్ శివారులో కామారెడ్డి ఐలాపూర్ గ్రామానికి చెందిన సంజీవులు (26) గా గుర్తించారు. ఉదయం నిజామాబాద్ లో పని ఉండడంతో 9 గంటల సమయంలో ఇంటి నుండి తన టూ వీలర్ పల్సర్ బైకుపై బయలు దేరి వెళ్ళాడు సంజీవులు.

పని ముగించుకుని తిరిగి వస్తుండగా ఫారెస్ట్ శివారులో వేగంగా వచ్చిన రెండు బైకులు అదుపుతప్పి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సంజీవులు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే ఇందల్వాయి ఎస్సై బి. నరేష్‌కుమార్ ఘటన స్థలానికి వెళ్లి కేసు నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించాడు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News