Sunday, December 22, 2024

శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మిట్ట కండ్రిగ వద్ద కారు, లారీ ఢీకొన్న దుర్ఘ టనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. తిరుపతి నుంచి శ్రీకాళహస్తీకి ఏడుగురు ఎర్టిగా వాహనంలో బయల్దేరి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు అక్కడికక్కడే దుర్మరణం పాల య్యారు. కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలవ్వగా క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తీ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

ఈ ఘటనలో మృతు లంతా ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. గాయపడిన భరత్ అనే వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు అతడినుంచి వివరాలు సేకరించి బంధువులకు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతులను రమేశ్, నరసింహమూర్తి, రాజ్యలక్ష్మి, శ్రీలత, అక్షయ, వెంకటరమణమ్మగా గుర్తించారు.తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతి నుంచి శ్రీకాళహస్తీకి వెళ్తుండగా మిట్టకండ్రిగ వద్ద అతివేగంతో ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతు న్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News