Sunday, December 22, 2024

తూరుపాక వద్ద రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -
  • బైకు, ఆటో ఢీ, ఒకరు మృతి

దుమ్ముగూడెం : మండల పరిధిలోని తూరుబాక, నరసాపురం గ్రామాల మధ్య భద్రాచలం, చర్ల ప్రధాన రహదారిపై రోడు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఈ ప్రమాదంలో బైక్ ఆటో ఢీకొనగా ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందారు. భద్రాచలం నుంచి వస్తున్న ఆటోను నడికుడి గ్రామానికి చెందిన కాకా రాంబాబు అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై భద్రాచలం వెళ్తుండగా అదే క్రమంలో లారీని క్రాస్ చేస్తూ ఎదురు వస్తున్న ఆటోని వేగంగా ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పినపాక మండలం పాండురంగాపురం గ్రామానికి చెందిన సోయం శ్రీహరి (50) అక్కడికక్కడే మృతి చెందగా, అదే మండలానికి చెందిన పలువురికి గాయాలయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా కూడా చిన్న నల్లబెల్లి గ్రామానికి ఓ కార్యక్రమం కోసం ఆటోలో వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అదేవిధంగా బైక్‌పై ప్రయాణిస్తున్న కాకా రాంబాబుతో పాటు మరో వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News