Monday, December 23, 2024

పెళ్లి బృందంతో వెళ్తున్న కారును ఢీకొన్న టిప్పర్: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

పల్నాడు: వెల్దుర్తి మండలం ఉప్పలపాడు గ్రామ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న కారును వేగంగా దూసుకొచ్చి అదుపుతప్పిన టిప్పర్ బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులలో‌ కారుడ్రైవర్, ఒక మహిళ, ఇద్దరు చిన్నారులున్నారు. ప్రమాద సమయంలో కారులో పదిమంది ప్రయాణిస్తున్నారు. క్షతగాత్రులను మాచర్ల సర్కార్ దవాఖానకు తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News