Wednesday, January 22, 2025

కర్నాటకలో రోడ్డు ప్రమాదం… ముగ్గురు ఆంధ్ర రైతులు మృతి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన రైతులు మిర్చి లోడుతో టెంపోలో వెళ్తుండగా కర్నాటక రాష్ట్రం దావణగెరిలో వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు రైతులు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లాకు చెందిన రైతులు మిర్చి లోడ్‌తో టెంపో వాహనం వెళ్తుండగా టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు రైతులు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు పెద్దకడుబూరు మండలం నాగలాపురానికి చెందిన మస్తాన్, పెద్ద వెంకన్న, శింగరాజనహల్లికి చెందిన ఈరన్నలుగా గుర్తించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం దావణగెరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News