Sunday, December 22, 2024

దూసుకొచ్చిన మృత్యువు

- Advertisement -
- Advertisement -

వాకర్లపైకి అపరిమిత వేగంతో కారు
తల్లీ కూతుళ్ల్లు అక్కడికక్కడే మృతి
మరో ఇద్దరి పరిస్థితి విషమం
పోలీసుల అదుపులో విద్యార్థి
ద్విచక్ర వాహనాన్ని కారు
ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు
విద్యార్థులు దుర్మరణం
నార్సింగి, ఇబ్రహీంపట్నంలో దుర్ఘటనలు

మనతెలంగాణ/సిటీబ్యూరో:వాకింగ్ చేస్తున్న వారి ని అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టిన సంఘటన బండ్లగూడ, సన్‌సిటీవద్ద మంగళవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో వాకింగ్ చేస్తున్న తల్లీ కూ తురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం…బద్రుద్దీన్ ఖాదిరి అనే యువకు డు తన పుట్టిన రోజు వేడుకులు జరుపుకునేందుకు ముగ్గురు స్నేహితులతో కలిసి మంగళవారం ఉద యం మ్యాసబ్‌ట్యాంక్ నుంచి మొయినాబాద్ వైపు కారులో బయలుదేరాడు.

బండ్లగూడ, సన్‌సిటీ వద్ద కు రాగానే వేగంగా వెళ్తున్న కారు టర్నింగ్ వద్ద మ ట్టి ఉండడంతో ఒక్కసారిగా అదుపు తప్పి వాకింగ్ చేస్తున్న ముగ్గురు మహిళలపైకి దూసుకెళ్లింది. ఆ త ర్వాత సమీపంలో ఉన్న మరో వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో వాకింగ్ చేస్తున్న బండ్లగూడ, లక్ష్మీనర్సింహానగర్‌కు చెందిన నెమళి అనురాధ(48), ఆమె కు మార్తె నెమళి మమత (26)లు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మాళవికను నాలాల్‌నగర్‌లోని ఆలివ్ ఆస్పత్రిలో, ఇం తాబ్ ఖాన్‌ను అపోలో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ప్రమాదానికి కారకుడైన బద్రుద్దీన్ మాసబ్ ట్యాం క్ శాంతినగర్‌కు చెందిన వాడు కాగా, అవినాష్ కాలేజీలో బిబిఏ మొదటి సంవత్సరం చేస్తున్నట్లు పోలీసులు తెలిపా రు. బద్రుద్దీన్ డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా కారు ఇచ్చిన కారు యజమాని అబ్దుల్ రెహ్మాన్‌ను నార్సింగి పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే బద్రుద్దీన్‌కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా బయటపడింది. కారును పోలీసులు సీజ్ చేశారు.
చేతులు మారిన కారు….
కారు ప్రమాదం చేసిన విద్యార్థి బద్రుద్దీన్ ఓఎల్‌ఎక్స్‌లో హోండా సివిక్ కారును (ఎపి09 బిజే 2588) కొనుగోలు చేసినట్లు తెలిసింది. గతంలో ఈ కారు మహ్మద్ ఇయాజ్ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో అమ్మేశాడు. దానిని ఓఎల్‌ఎక్స్ డీల ర్ నుంచి మరో వ్యక్తి కొనుగోలు చేయగా అతడి వద్ద నుం చి బద్రుద్దీన్ ఖాదిరి కారును కొనుగోలు చేశాడు. అయితే ఇప్పటివరకు కారు పేపర్లు, అడ్రస్ బద్రుద్దీన్ పేరుపై మా రలేదు. పోలీసులు కారు మొదటి యజమాని మహ్మద్ ఇయాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ముగ్గురు విద్యార్థులు దుర్మరణం
మన తెలంగాణ/ ఇబ్రహీంపట్నం: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనటంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. సిఐ రామక్రిష్ణ, ఎస్‌ఐ మారయ్య వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. మంగళవారం సా యంత్రం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని రాయపోల్ నుండి ఇబ్రహీంపట్నం వైపు ద్విచక్ర వాహనం టిఎస్ 08జిపి 0552పై ముగ్గురు విద్యార్థులు వస్తున్నారు. ఈ క్రమంలో జనహర్ష డ్రీమ్‌సిటి వద్ద రాయపోల్ పెట్రోల్ బంకు సమీపంలో ఎర్త్‌గా కారు ఏపి 28 బిఎక్స్ 0010 విద్యార్థుల వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న కె. నవీన్ (20), ఇ. భానుప్రసాద్ (20), నారాయణరెడ్డి (21) లకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు.

వెంటనే స్థానికు లు పోలీసులకు సమాచారం అం దించడంతో సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. అయితే వీరు భరత్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమి త్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రామక్రిష్ణా , ఎస్‌ఐ మారయ్య తెలిపారు. కాగా భారత్ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై ఆ కళాశాల డైరెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుబూతి తెలిపారు. మంచి భవిష్యత్ ఉన్న విద్యార్థులు ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం బాధాకరమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News