- Advertisement -
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. 20 మంది కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటో జూలూరుపాడు మండలం గుండ్లరేవు పెద్దవాగు వంతెన పైనుంచి ట్రాలీ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళ కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిర్చి కోతలకు కూలీలతో ఎలకలొడ్డు, రాంపురం నుంచి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -