- Advertisement -
ఆర్టిసి బస్సు కిందపడి మహిళ మృతి
మనతెలంగాణ, హైదరాబాద్ : ఆర్టిసి బస్సు వెనుక చక్రాల కిందపడడంతో ఓ మహిళ మృతిచెందిన సంఘటన చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… సరూర్‌నగర్‌కు చెందిన రమణమ్మ(48) బైక్‌పై వెనుక కూర్చుని ఉంది. చాదర్‌ఘాట్ సమీపంలోని చర్మాస్ ఎదురుగా ఆర్టిసి బస్సును ఎడమ వైపు నుంచి బైక్ ఓవర్ టేక్ చేస్తుండగా, ఒక్కసారిగా బైక్ అదుపు తప్పడంతో బస్సు వెనుక చక్రాల కిందపడింది. బస్సు ఆమెపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -