Wednesday, January 22, 2025

తెనాలిలో పెళ్లికి వెళ్లివస్తూ ప్రమాదానికి గురైన కారు..

- Advertisement -
- Advertisement -

ఏలూరు: జిల్లాలోని నూజివీడు మండలం మిట్టగూడెం శివారులో ఆదివారం రోడ్డుప్రమాదం జరిగింది. లీలానగర్ క్రాస్ రోడ్డు దగ్గర కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. తెనాలిలో పెళ్లికి వెళ్లివస్తూ ఉండగా కారు ప్రమాదానికి గురైంది. మృతులను విస్సన్న పేటకు చెందిన లాలు, సునీతగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అధికవేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News