Sunday, December 22, 2024

గద్వాలలో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల పరిధిలో ఆటో, బొలెరో వాహనం ఢీ కొట్టిన సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. ధరూర్ ఎస్‌ఐ కర్నె శేఖర్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గద్వాల పట్టణం దౌదర్‌పల్లిలో నివసిస్తున్న జమ్ములమ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి నియోజకవర్గంలోని పల్లెపల్లె తిరుగుతూ పాత చీరలు, ఇతర దుస్తులు కొనుగోలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో జమ్ములమ్మ (48), తన కుమారుడు అర్జున్(24), కోడలు వైషాలీ(22)తో కలిసి వారి సొంత ఆటోలో శనివారం గద్వాల టౌన్ నుంచి రాయచూరుకు వెళ్తున్న

సమయంలో ధరూర్ మండల కేంద్రం సమీపంలో వీరు ప్రయాణిస్తున్న ఆటోను, ధరూర్ నుంచి గద్వాల వైపు వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న జమ్ములమ్మతో పాటు కుమారుడు అర్జున్, కోడలు వైషాలి సంఘటన స్థలంలో మృతి చెందారు. కాగా అర్జున్‌కు, వైషాలీకి ఇటీవల్లే వివాహం అయింది. విషయం తెలుసుకున్న ధరూర్ ఎస్‌ఐ కర్నెశేఖర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న గద్వాల డీఎస్పీ రంగస్వామి, సీఐ చంద్రశేఖర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News