Wednesday, January 22, 2025

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి

- Advertisement -
- Advertisement -

రాయ్‌గడ్‌: మహారాష్ట్ర రాష్ట్రంలోని రాయ్‌గడ్‌ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో చిన్నారి సహా తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. రాయ్‌గడ్‌ జిల్లా రెపోలి వద్ద ముంబై-గోవా జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో చిన్నారి తీవ్రంగా గాయపడింది. పాపను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలుచేపట్టారు. లారీ ముంబై వైపు వెళ్తున్నదని, కారు గుహాగర్‌ వస్తున్నదని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో చిన్నారితోపాటు ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News