Sunday, January 19, 2025

గుంటూరులో ఘోరు రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

గుంటూరులో ఘోరు రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పెదకాకాని వద్ద లారీ, కారు, టాటా ఏస్‌ వాహనాలు మూడు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 10 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి.. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో చనియపోయిన వారిని తేజ(20), రాంబాబు(40), మధు(25)లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News