Monday, January 20, 2025

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని వట్టి చెరుకూ రు సమీపంలో ఓ ట్రాక్టర్ అదుపుతప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరో ముగ్గు రు మృత్యువాత పడ్డారు. గుంటూరు జిజిహెచ్‌లో చికిత్సపొందుతూ మరో మహిళ గరికపూడి సలోమి మృతి చెందింది. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. బాధితులు ప్రత్తిపాడు మండలం కొండెపాడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

మృతి చెందిన వారిలో నాగమ్మ, మేరమ్మ, రత్నకుమారి, నిర్మల, సుహాసిని, ఝాన్సీరాణి, సలోమీ ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుంటూరు జిజిహెచ్‌కు తరలించారు. క్షతగాత్రులలో కొందరికి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. ఈ ఘటనతో కొండెపాడు, జూపూడిలో విషాదచాయలు అలము కున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక సిసిటివి ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. డ్రైవర్ నిర్లక్షం వల్లే ప్రమాదం జరిగిందని గుర్తించారు.

ట్రాక్టర్‌ను అతి వేగంగా నడపడం వల్లే అదుపు తప్పిందని తెలిపారు. అమ్మ, అమ్మమ్మతో పాటు కొడెపాడు నుంచి జూపూడికి శుభకార్యానికి వెళ్తున్నామని, తమతో పాటు మరికొంతమంది శుభకార్యానికి వెళ్లేందుకు ట్రాక్టర్‌లో ప్రయాణి స్తున్న క్రమంలో ట్రాక్టర్ బోల్తాపడి ప్రమాదం సంభవించించినట్లు కార్తీక అనే ప్రయాణీకురాలు వెల్లడించింది.
ట్రాక్టర్ బోల్తా ప్రమాద బాధితులకు ప్రభుత్వ సాయం
వట్టిచెరుకూరు ప్రమాద బాధితులను పత్తిపాడు ఎంఎల్‌ఎ సుచరిత పరామర్శించారు. ప్రభుత్వం తరపున సాయం ప్రకటించారు. మృతులకు రూ.5 లక్షలు, తీవ్ర గాయాలైన వారికి రూ. లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ.25 వేలు సాయం అందస్తామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News