Sunday, December 22, 2024

మేడారం వెళ్లి వస్తుండగా ప్రమాదం.. చిన్నారితో సహా నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

కటాక్షాపూర్: హనుమకొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కటాక్షాపూర్-ఆత్మకూరు మధ్య దూసుకొచ్చిన టిప్పర్ అదుపుతప్పి కారును బలంగా ఢీకొట్టింది. కారు- టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో చిన్నారితో సహా నలుగురు అక్కడిక్కడే మృతి మృతిచెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రి తరలించారు. మేడారం వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని బాధితులు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News