Sunday, January 19, 2025

హర్యానా రెవారి వద్ద రోడ్డు ప్రమాదం… ఐదుగురి మృతి

- Advertisement -
- Advertisement -

రెవారి(హర్యానా): హర్యానాలోని రెవారి ప్రాంతం సిహ గ్రామం సమీపంలో మహేంద్రగఢ్ రోడ్డు వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారని పోలీస్‌లు బుధవారం వెల్లడించారు. హర్యానా రోడ్‌వేస్ బస్సు, కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులోని వారిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా పెళ్లికి వెళ్లి తిరిగి చర్కిదాద్రికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు కారు నుంచి బాధితులను బయటకు తీసి ట్రామా సెంటర్‌కు పంపించగా, అక్కడి డాక్టరు వారంతా చనిపోయారని వెల్లడించారు. మృతదేహాలను మార్చురీలో భద్రపరిచామని, మృతుల కుటుంబాలకు సమాచారం అందించామని, వారు రాగానే పోస్ట్‌మార్టమ్ నిర్వహిస్తామని పోలీస్‌లు వివరించారు.

అమరావతి ఎంపీ నవనీత్ రాణాని హత్య చేస్తామని బెదిరింపు

అమరావతి ఎంపీ నవనీత్ రాణాను హత్య చేస్తామని ఆమె వాట్సాప్‌కు బెదిరింపు కాల్ వచ్చింది.ఆమె వాట్సాప్ నంబర్‌కు గుర్తు తెలియని వ్యక్తులు ఆడియో మెసేజ్ పంపారని పోలీస్‌లు బుధవారం చెప్పారు. ఇండిపెండెంట్ ఎంపీ అయిన నవనీత్ రాణాను చంపుతామని బెదిరించడమే కాకుండా ,అభ్యంతరకరమైన పదజాలంతో దూషిస్తూ మెసేజ్ మార్చి 3న వచ్చిందని చెప్పారు. ఆమె పర్సనల్ అసిస్టెంట్ పోలీస్‌లకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్టు పోలీస్‌లు తెలిపారు. ఆ ఆడియో క్లిప్పింగ్‌లో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి అమిత్‌షా, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగత్ లను కూడా దూషించినట్టు చెప్పారు. అయితే ఇంతవరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News