Sunday, December 22, 2024

పెద్దమ్మతల్లి బోనాల జాతరకు వెళ్లి వస్తూ అనంతలోకాలకు

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని హుజూరాబాద్ లోని బోర్నపల్లి వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. టిప్పర్ బోల్తాపడి మట్టి  మీద పడటంతో యువకుడు, యువతి అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మరో యువతి హుజూరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

బోర్నపల్లిలో పెద్దమ్మతల్లి బోనాల జాతర నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మట్టి టిప్పర్ ఎలబోతారం నుంచి హుజూరాబాద్ కు వెళ్తుంది. బోర్నపల్లి మూలమలుపు వద్ద బ్రేక్ వేయడంతో టిప్పర్ అదుపుతప్పింది. టిప్పర్ బోల్తా పడటంతో బైక్ పై ఉన్న ముగ్గురిపై మట్టి పడింది. మృతులను బోర్నపల్లికి చెందిన విజయ్, వర్ష, సింధుజగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News