Wednesday, January 22, 2025

మద్యం మత్తుతోనే గచ్చిబౌలి కారు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

Road Accident In Hyderabad Gachibowli

హైదరాబాద్: హోలీ పండుగ రోజు శుక్రవారం గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ వద్ద చోటు చేసుకున్న కారు ప్రమాద ఘటనపై దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. తమ విచారణలో ప్రమాదానికి అసలు కారణం తెలుసుకున్న పోలీసులు ఖంగు తిన్నారు. ఎల్లా హోటల్ వద్ద కారు బీభత్సంతో ఇద్దరు మహిళలు మృతి చెందిన విషయం తెలిసిందే.. కారును అతి వేగంగా నడపడంతో పాటు అది అదుపు తప్పి ఓ మహిళను ఢీ కొట్టడంతో పాటు పల్టీ కొట్టడానికి మద్యం సేవించి డ్రైవ్ చేయడమే కారణమని తేల్చారు. డి. రోహిత్ అనే (25) అను యువకుడు, ఎస్. గాయత్రి అనే (యూట్యూబర్) జూనియర్ ఆర్టిస్ట్ కారు ప్రయాణించారు. ఈ కారు ప్రమాదంలో గాయత్రి మృతి చెందగా, రోహిత్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే హోళి పండుగ సందర్భంగా రోహిత్ తన స్నేహితులతో కలిసి మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించారు.

హోళీ పండుగకు ముందు రోజే గురువారం మద్యం కొనిపెట్టుకుని వీరు రోహిత్ , గాయత్రితో పాటు మరో 5 మంది తన స్నేహితుడి ఇంట్లో పార్టీ చేసుకున్నారు. అనంతరం మద్యాన్ని కొబ్బరి బొండల్లో నింపుకుని ప్రిజబ్ పబ్‌లో జరిగిన వేడుకలకు హాజరయ్యారు. ఈ తర్వాత తమ వెంట కారులో వెంట తెచ్చుకున్న కొబ్బరి బొండాల్లోని మద్యం సేవించడం, ఆ తర్వాత కారులో బయలుదేరారు. ఇదే క్రమంలో మద్యం మత్తులో కారును అతివేగం నడపడంతో నియంత్రణ కొల్పోయి ఎల్లా హోటల్ వద్ద చెట్లకు నీరు పెడుతున్న నాయకుని మహేశ్వరి ఢీకొట్టిడంతో పాటు బోల్తా పడింది. దీంతో కారు డీ కొన్న మహేశ్వరి అక్కడికక్కడే మరణించగా, కారు బోల్తాపడడంత కారులో నుంచి బయట పడ్డ గాయత్రి సైతం ఆసుపత్రి తరలించ లోపే మృతి చెందింది.

మహేశ్వరి కుటుంబంలో విషాదం 

ఎల్లా హోటల్ వద్ద ఇద్దరు మహేశ్వరితో పాటు గతంలో ఆమె భర్త సైతం ఇదే ప్రాంతంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు భోరున విలపించారు. 2005లో ఈ హాటల్ నిర్మాణ సమయంలో ప్రమాదవశాత్తు గోడ కూలి మహేశ్వరి భర్త మరణించారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇప్పుడు ఇదే హోటల్ ముందు చెట్లకు నీరు పెడుతూ మహేశ్వరి సైతం ఆకాల మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దీంతో మహేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె గ్రామస్తులతో పాటు కుటుంబ సభ్యులు హోటల్ ముందు ధర్నా నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News