Wednesday, January 22, 2025

పదేళ్ల తర్వాత ఇంటికి చేరిన గల్ఫ్ కార్మికుడు.. తండ్రి వచ్చిన కాసేపటికే కొడుకు మృతి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని మహాలక్ష్మినగర్‌కు చెందిన చౌట్‌పల్లి మోహన్, పద్మినిల కుమారుడు శివకార్తీక్ (12) 5వ తరగతి చదువుతున్నాడు. తండ్రి మోహన్ ఉపాధి నిమిత్తం పదేళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లారు. సోమవారం ఉదయం ఆయన తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఎయిర్‌పోర్టుకు వెళ్లి తీసుకురాగా, తమ ఇంట్లో తాగునీరు అయిపోవడంతో తాను తీసుకొస్తానని శివకార్తీక్ ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. బైపాస్ రహదారిలోని దేవిశ్రీ గార్డెన్ సమీపంలో వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్నాడు. తీవ్ర గాయాల పాలవడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News