Wednesday, January 22, 2025

జనగామలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

జనగామ: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం లింగాల గణపురం మండలంలోని కుందారం వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి రోడ్డు ప్రక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News