Monday, December 23, 2024

ఝార్ఖండ్‌లో రోడ్డు ప్రమాదం… ఆరుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

రాంచి : ఝార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. డ్రైవర్‌తోసహా తొమ్మిదిమందితో వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీకొనడంతో కారు పల్టీలు కొట్టి రోడ్డు పక్కన చెట్టును ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, మరొకరు చికిత్స పొందుతూ మరణించారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా ఆదిత్యపూర్ వాసులుగా పోలీస్‌లు గుర్తించారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీస్‌లు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News