Wednesday, April 24, 2024

డివైడర్‌ను ఢీకొట్టిన కారు

- Advertisement -
- Advertisement -
road accident in jubilee hills
యువకుడికి గాయాలు

హైదరాబాద్: అతి వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఓ యువకుడికి గాయాలైన సంఘటన నగరంలోని జూబ్లీహిల్స్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… అర్మన్ అనే యువకుడు ఇటీవలే కొనుగోలు చేసిన బిఎండబ్లూ కారులో జూబ్లీహిల్స్ నుంచి ఫిలింనగర్ రామానాయుడు స్టూడియో మీదుగా వెళ్తున్నాడు. రామానాయుడు స్టూడియో వద్ద ఉన్న మూల మలుపు వద్ద కారు ఒక్కసారిగి అదుపు తప్పడంతో డివైడర్‌ను ఢీకొట్టాడు. కారులోని నాలుగు బెళూన్లు ఓపెన్ కావడంతో కారు నడుపుతున్న అర్మన్‌కు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతడిని అపోలో ఆస్పత్రికి తరలించారు. కారును మూడు రోజుల క్రితమే కొనుగోలు చేసినట్లు తెలిసింది. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News