Sunday, January 19, 2025

రేపు కొడుకు పెండ్లి… దావత్ కి యాటల కోసం వెళ్తూ…

- Advertisement -
- Advertisement -

ఎల్లారెడ్డి : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ తాండ వద్ద జరిగింది. ఎస్సై గణేష్ తెలిపిన వివరాల ప్రకారం… మండల పరిధిలోని రుద్రారం గ్రామానికి చెందిన దుర్గయ్య అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. దుర్గయ్య కొడుకు వివాహం ఫిబ్రవరి 3వ తేదీన ఉండగా దావత్ కొరకు కావలసిన మేక కోసం గురువారం మార్కెట్‌కు తన సమీప బంధువుతో బయలుదేరాడు. ఎల్లారెడ్డి పరిధిలోని అన్నాసాగర్ తాండా అతని టివిఎస్ ఎక్స్‌ల్ వాహనాన్ని గుర్తు తెలియని మరొక ద్విచక్రవాహనం వేగంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో దుర్గయ్య అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి రాములుకు స్వల్ప గాయాలు అయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మృతుడి కుమారుడు వెంకట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News