Monday, December 23, 2024

లారీ అతి వేగం.. తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

బిచ్కుంద: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో రాత్రి సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాల వేగం మితి మీరిపోతుంది. విచ్చల విడిగా, పరిమితికి మించి లోడులతో పాటు అతివేగంగా వెళుతుండటంతో గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగిన సంఘటనలున్నాయి. తాజాగా శుక్రవారం రాత్రి ఓ లారీ ఏకంగా పుల్కల్ చెరువులోకి వెళ్లడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

రాత్రివేళలో ఆత్రుతగా వెళదామనే క్రమంలో మూలమలుపును సైతం లెక్క చేయకుండా డ్రైవర్ అతి వేగంగా నడుపడంతో చెరువులోకి లారీ దూసుకెళ్లిందని, కాగా, పెనుప్రమాదం తప్పిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. రాత్రి సమయం కావడంతో ఎవ్వరు లేరని, ఎవరైనా ఉంటే పరిస్థితి ఏంటని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అర్ధరాత్రి నిఘా పెట్టాలని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంతో పాటు రాత్రివేళలో అక్రమ ఇసుక రవాణా జరుగకుండా చూడాలని మండల వాసులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News