Friday, November 22, 2024

ఆర్టీసి బస్సు, ట్రాక్టర్ ‘ఢీ ’: పోలీస్ వాహనంలో గర్భిణి తరలింపు..

- Advertisement -
- Advertisement -

ఇల్లంతకుంట : రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామ శివారు లో ఆర్టీసి బస్సు, ట్రాక్టర్ (బోర్ వేల్) ఢీ కోనడంతో ఒక్క సారిగా బస్సు బోల్తా పడింది. బుధవారం ఇల్లంతకుంట నుండి ప్రయాణికులతో రహీంఖాన్‌పేట నుండి వెళ్తున్న ఆర్టీసి బస్సుకు ఎదురుగా వస్తున్న బోర్‌వేల్ ట్రాక్టర్‌లు ఢీ కోనడంతో ప్రమాదం జరిగింది. బస్సు పక్కనే ఉన్న కందకంలో పడిపోగా, ట్రాక్టర్ బోల్తాకోట్టింది.

దీంతో అక్కడే ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందివ్వండంతో, యువకులు, గ్రామస్థులతో కలసి బస్సులో చిక్కుకున్న సుమారు 41 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. వీరలో 19 మందికి గాయాలు, కాగా మరి కొంత మందికి స్పల్ప గాయాలయ్యాయి. ఆర్టీసి డ్రైవర్ ఫీర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజేష్ తెలిపారు.

పోలీస్ ఇన్నోవా వాహనంలో గర్బిణి తరలింపు..
బస్సు బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన గర్బిణి గైని పూజకు గాయాలు కావడంతో ఎస్‌ఐ కే రాజేష్ ఇన్నోవా వాహనంలో సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. తన తల్లి గైని పవిత్రకు కూడా గాయాలయ్యాయి.

సమయానికి రాని 108 అంబులేన్స్‌లు..
బస్సు ప్రమాదం జరిగి నిమిషాలు గడుస్తున్న ఒక్క అంబులేన్స్ సంఘటన స్థలానికి చేరుకోలేదు. దీంతో స్థానికులు, పోలీసులు రోడ్డు పై వెళ్తున్న ఆటోలను ఆపి గాయపడిన వారిని ఎక్కించి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కొద్ది దూరం వెళ్లగానే అంబులేన్స్‌లు రావడంతో మళ్లి వారిని ఆటోల నుండి 108 వాహనంలో ఎక్కించారు. ప్రమాదం జరిగి 50 నిమిషాలు దాటిన అంబులేన్స్‌లు చేరుకోకపోవడంపై స్థానికులు అగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదంలో గాయపడిన వారు వీరే..
బస్సులు ప్రయాణిస్తున్న వారిలో గాయపడి న వారు బడుగు మల్లయ్య, బడుగు నర్సవ్వ, గంగధర రా జవ్వ, సింగరి శీరిష, సింగరి శ్రావణ్, గైని పవిత్ర, గైని పూజ, ఎండి ఇసాక్, సమ్మెట బాలయ్య, చుక్క అం జన్న, దుర్శేట్టి లావణ్య, పెంటాల లక్ష్మీ, గడ్డమీద అనిత, రాజాంరెడ్డి లింగారెడ్డి, పండుగ లింగయ్య, సంగెం వేదశ్రీ, సంగెం రేణుఖ, చింతల్ తాణ ముత్తయ్యలు గాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News