Friday, December 20, 2024

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: ఐదుగురు ఏపీ వాసులు మృతి

- Advertisement -
- Advertisement -

కర్ణాటక: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ, యువతి సహా ఐదుగురు యాత్రికులు ప్రాణాలు కోల్పోగా, మరో 13 మంది గాయపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున యాద్గిర్‌లో వారు ప్రయాణిస్తున్న జీపు ఆగివున్న ఉన్న ట్రక్కును ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.

నంద్యాల జిల్లా ఆత్మకూర్ తాలూకా వెల్లగూడు గ్రామానికి చెందిన యాత్రికులు కలబురగి జిల్లాలో జరిగే ఖ్వాజా బందెనవాజ్ ఉరుస్ జాతరకు హాజరయ్యేందుకు బయలుదేరారు. సుమారు తెల్లవారుజామున 2 గంటలకు, యాద్గిర్ జిల్లాలోని పడిచక్ర గ్రామం వద్ద వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ట్రక్కును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన 13 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం కలబురగిలోని ఆసుపత్రికి తరలించారు. మృతులను మునీర్ (40), నయామత్(40), రమీజా బేగం(50), మద్దత్ షీర్ (12), సుమ్మి(13)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News