Thursday, January 23, 2025

కర్నాటకలో రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

13మంది తెలుగువారు దుర్మరణం

బెంగళూరు : చిక్కబళ్లాపూర్‌లో ఆగి ఉన్న ట్యాంకర్‌ను టాటా సుమో వాహనం ఢీకొట్టడంతో 13 మంది మృతి చెందారు. టాటా సుమోలో మొత్తం 18 మంది ప్రయాణిస్తున్నట్టు అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 7 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో 9 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతులంతా సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. కూలీ పనుల కోసం బెంగళూరు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. చిక్‌బళ్లాపూర్ ఎస్‌పి నగేష్ ప్రమాద స్థలాన్ని సందర్శించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పొగమంచే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News