Monday, December 23, 2024

రేణుక ఎల్లమ్మ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం.. ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్నాటకలోని బెళగాని జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చుంచనూరు వద్ద విఠలప్ప దేవాలయం ఎదురుగా ఉన్న పెద్ద మర్రిచెట్టును వాహనం ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. రామదుర్గ్ తాలూకాలోని రేణుకా-ఎల్లమ్మ ఆలయ జాతరలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

చుంచనూరులోని విఠల్‌-రుక్మాయి దేవాలయం సమీపంలోకి వాహనం రాగానే డ్రైవర్‌ అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. మృతులను హులకుంట గ్రామానికి చెందిన హనుమవ్వ (35), దీపక్ (31), సవిత (12), సుప్రీత (11), మారుతి (42), ఇంద్రవ్వ (24)గా గుర్తించారు. మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కట్కోల్ పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News