ఖమ్మం రూరల్ మండల పరిదిలోని వరంగల్ క్రాస్‌రోడ్డులో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సూర్యాపేట జిల్లా,కోదాడ మండలం, గోల్‌తండా గ్రామానికి చెందిన బానోత్ భూరి(58) ఏన్కూర్‌లోని బంధువుల వివాహానికి వెళ్లేందుకు వరంగల్ క్రాస్ రోడ్డులో బస్ కోసం ఎదురుచూస్తోంది.
ఈ క్రమంలో మూత్రవిసర్జన కోసం రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న గూడ్స్‌లారీ డ్రైవర్ అతివేగంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో కిందపడిపోయిన మహిళ వీపుపై నుంచి వెనుక టైర్లు వెళ్లడంతో మృతదేహం నుజ్జునుజ్జయ్యింది. కాగా ఎస్‌ఐ కుసుకుమార్ ఘటన స్థలానికి చేరుకుని, అన్నం ఫౌండేషన్‌కు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుమారుడు బానోతు బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహ్మద్‌యాకుబ్ పేర్కొన్నారు.