Monday, December 23, 2024

జమ్మూకాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కిష్త్వార్ జిల్లాలోని డంగుదురు డ్యామ్ సైట్ సమీపంలో ఓ క్రూజర్ వాహనం అదుప్పత్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ప్రమాదంపై స్పందించిన కిష్త్వార్ డిప్యూటీ కమిషనర్ దేవాన్ష్ యాదవ్.. డంగుదురు డ్యామ్ సైట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాం అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News