Monday, April 28, 2025

కొడంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

కొడంగల్: వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఐనన్‌పల్లి వద్ద రెండు కార్లు కార్లు ఢీకొన్న ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన ముగ్గురు వ్యక్తులు కర్ణాటకలోని గనుగాపూర్‌ దత్తాత్రేయ స్వామి ఆలయానికి కారులో వెళ్లి తిరిగి వస్తుండగా.. చిట్టపల్లి-యాలమద్ది గ్రామాల మధ్య రహదారిపై బొలెరో వాహనం ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మృతదేహాలను కొడంగల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News