Saturday, January 25, 2025

కొండగట్టులో రోడ్డుప్రమాదం.. 11 మందికి తీవ్రగాయాలు

- Advertisement -
- Advertisement -

జగిత్యాల కొండగట్టు ఘాట్ రోడ్డులో శనివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఘాట్ రోడ్డు దిగుతూ ఆలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కొండగట్లు అంజన్నను దర్శించుకుని వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను మంచిర్యాల జిల్లా మ్యాదరిపేట, లక్షేట్ పేట వాసులుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News