Saturday, January 25, 2025

ఎపిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కృష్ణా జిల్లా గన్నవరం హైవేపై వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తుండగా.. బాపులపాడు మండలం కోడూరుపాడు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. మృతులు నెల్లూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News