Saturday, January 25, 2025

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు చిన్నారులతో సహా 13మంది మృతి

- Advertisement -
- Advertisement -

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజ్‌గఢ్ జిల్లాలోని పిప్లోడి ప్రాంతంలో ఆదివారం జూన్ 2 అర్థరాత్రి ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులతో సహా 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంగఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి.. క్షతగ్రాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇందులో తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం భోపాల్‌కు పంపారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

బాధితులు రాజస్థాన్‌లో ఒక వివాహానికి హాజరయ్యేందుకు ట్రాక్టర్‌పై వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News