Monday, December 23, 2024

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం: ఆరుగురి మృతి

- Advertisement -
- Advertisement -

థానే (మహారాష్ట్ర) : థానే జిల్లా పడ్ఘా ఏరియాలో మంగళవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో జీపుకు ట్రక్కు ఢీకొని జీపులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. జీపులో విద్యార్థులతోపాటు మరికొందరు ఉన్నారు. పఘ్డా నుంచి ఖడ్వలి రైల్వేస్టేషన్‌కు జీపు వెళ్తుండగా ఎదురుగా కంటైనర్ ట్రక్కు స్పీడుగా దూసుకువచ్చి ఢీకొంది. దీంతో జీపును కంటైనర్ 100 మీటర్ల దూరం ఈడ్చుకుపోవడంతో జీపు తలకిందులైంది.

నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు భివాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని , స్వల్పంగా గాయపడిన మరో ముగ్గురికి ప్రథమ చికిత్స చేసి డిశ్చార్జి చేయడమైందని పఘ్డా పోలీస్ అధికారి తెలిపారు. మృతులు చిన్మీ షిండే (15), రియా పరదేశి, చైతలి పింపిల్ (27), సంతోష్ అనంత్ జాదవ్ (50), వసంత ధర్మజాదవ్ (50), ప్రజ్వల్ ఫిర్కే గా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News