Monday, December 23, 2024

మచిర్యాలలో లారీ, బైకు ఢీ: దంపతులు మృతి

- Advertisement -
- Advertisement -

లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం గుల్లకోట వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన లారీ, బైకు ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో దంపతులు మృతి చెందారు. మృతులను దండేపల్లి మండలం మేదరిపేట వాసులుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అధిక వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News