Monday, January 20, 2025

విద్యార్థుల బస్సు బోల్తా: 15 మంది మృతి

- Advertisement -
- Advertisement -

మణిపూర్‌లోని నోనీ జిల్లాలో బుధవారం విద్యార్థులతో వెళ్తున్న రెండు బస్సులు అదుపు తప్పి బోల్తా పడిపోవడంతో కనీసం 15 మంది విద్యార్థులు చనిపోయారని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మణిపూర్‌లోని నోనీ జిల్లాలోని బిస్నుపూర్-ఖౌపుమ్ రోడ్డులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులను తీసుకువెళుతున్న రెండు బస్సులు యారిపోక్‌లోని తంబలను హయ్యర్ సెకండరీ స్కూల్‌కు చెందినవిగా గుర్తించారు. బస్సులు స్టడీ టూర్ కోసం ఖౌపుమ్ వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News