- Advertisement -
కండ్లకోయ: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన టెంపో కండ్లకోయ వద్ద లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతిచెందారు. ఈ రోడ్డుప్రమాదంలో మరో 9 మందికి గాయాలయ్యాయి. తక్షణమే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ యశోధ ఆస్పత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
- Advertisement -