Sunday, January 26, 2025

నెల్లూరులో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు లారీలు, ప్రైవేటు బస్సు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. నెల్లూరు జిల్లా కావలి ముసునూరు టోల్ ప్లాజా వద్ద అర్థరాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

ముందుగా ఆగి ఉన్న లారీని మరో లారీ వెనుకనుంచి ఢీకొట్టంది. అదేసమయంలో ఎదురుగా వస్తున్న ప్రవేట్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ఘటనాస్థలిలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పోలీసులు తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ కు వస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News