Wednesday, January 22, 2025

ఇందల్వాయిలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ఇందల్వాయి: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతులంతా యూపీకి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. 44వ నంబరు జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ఓ వరి కోత యంత్రం రోడ్డుపై ఆగిపోగా.. భారీగా వాహనాలు నిలిచాయి. ఇదే సమయంలో యూపీ వైపు వెళ్తున్న బస్సు, ఓ లారీ ఢీకొన్నాయి. బస్సులో ఉన్న వారంతా కిందికి దిగారు.

అదే సమయంలో వెనుకాల నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వాహనం జనాల మీదికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఘటన స్థలంలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులు ప్రదీప్, జీతు, దుర్గేష్ ప్రసాద్, గణేష్ గా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాద చాయాలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News