Wednesday, January 22, 2025

పెద్దపల్లిలో రోడ్డుప్రమాదం: ముగ్గురు మహిళా రైతు కూలీలు మృతి

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: సుల్తానాబాద్‌ మండలం మియాపూర్‌ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. మియాపూర్ సమీపంలో బాధితులు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో ఈ ఘటన జరిగింది. ముగ్గురు మహిళలు బేతి లక్ష్మి (52), మల్యాల వైష్ణవి (31), పోచంపల్లి రాజమ్మ (54) అక్కడికక్కడే మృతి చెందగా, మరికొంత మంది కూలీలకు గాయాలయ్యాయి. సుల్తానాబాద్ మండలం చిన్నబొంకూరు వాసులు, వ్యవసాయ కూలీలు మొక్కజొన్న పొలాల్లో పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News