Friday, December 27, 2024

రాచాపూర్‌లో రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

లక్ష్మణచాంద : మండలంలోని రాచాపూర్ ( చంద్రాపూర్ ) గ్రామ సమీపంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రాచాపూర్ గ్రామానికి చెందిన జాడ రాజేశ్వర్ వ్యవసాయ తోటకు వెళ్తుండగా డిజె వ్యాన్ అతడిని ఢీ కొట్టడింది. దీంతో రాజేశ్వర్ ఆ వ్యాన్ అద్దాల పైపడి కొంతదూరం వెళ్లి కిందపడిపోయాడు. బాధితున్ని నిర్మల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితివిషమించి మరణించినట్టు ఎస్సై రాముల్ గైక్వాడ్ తెలిపారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News