Wednesday, April 2, 2025

లారీ, కారు ఢీ: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలం మూడపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ, కారు ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప దవాఖానకు తరలించారు. మృతులను రుద్రంగికి చెందిన తోట మహేశ్(24), కిషోర్(22)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News